బ్రేకింగ్ : జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.... కరోనాను ఎదుర్కొనేందుకు 38 వేల బెడ్లు సిద్ధం...?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 186 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన 36 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో జగన్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 
 
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం 38,000 బెడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని అమలు దిశగా చర్యలు చేపట్టింది. సాధారణ బెడ్లతో కలిపి ప్రభుత్వం 38,000 పడకలను సిద్ధం చేసింది. తాజా అంచనాలతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైనా అందరికీ మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. వీటితో పాటు 1334 వెంటిలేటర్లు, 15,333 ఆక్సిజన్ పడకలు, 5,013 ఐసీయూ బెడ్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: