ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.... ఆధార్ తో డిజిటల్ పొదుపు ఖాతా...?

Reddy P Rajasekhar

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఆధార్ ఆధారిత డిజిటల్ పొదుపు అకౌంట్ ను ప్రారంభించే సదుపాయాన్ని ఎస్బీఐ పునఃప్రారంభించింది. ఎస్బీఐ ఖాతాదారులు యోనో ఫ్లాట్ ఫాం ద్వారా ఆధార్ ను ఉపయోగించి ఆన్ లైన్ లో డిజిటల్ పొదుపు ఖాతాను ఓపెన్ చేయవచ్చు. పాన్, ఆధార్ నంబర్ తో ఇన్ స్టా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను తెరవచ్చు. సాధారణ ఎస్బీఐ కస్టమర్లకు లభించే అన్ని సదుపాయాలు వీరికి లభిస్తాయి. 
 
ఆధార్ తో డిజిటల్ పొదుపు ఖాతా ప్రారంభించాలనుకునేవారు మొదట యోనో యాప్ డౌన్ లోడ్ చేసుకుని పాన్, ఆధార్, మొబైల్ నంబర్ వివరాలను అందించాలి. అనంతరం మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మరిన్ని వివరాలు నమోదు చేస్తే బ్యాంక్ ఖాతా ప్రారంభమవుతుంది. వీరికి ఎస్.ఎమ్.ఎస్ అలర్ట్, మిస్డ్ కాల్ సర్వీస్ లాంటి సేవలు కూడా అందుతాయి. ఖాతాదారు ఖాతాను యాక్టివేట్ చేసుకుని లావాదేవీలు జరపవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: