బ్రేకింగ్ : కర్నూలు జిల్లాలో దారుణం.... భార్యపై అనుమానంతో కొడుకును కడతేర్చిన తండ్రి...?
భార్యపై పెంచుకున్న అనుమానం భర్తను మృగంగా మార్చింది. కర్నూలు జిల్లా బెళగల్ మండలం చింతమానుపల్లె గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనకు పుట్టలేదంటూ 18 నెలల చిన్నారిని కన్నతండ్రే దారుణంగా హత్య చేశాడు. పూర్తి వివరాలలోకి వెళితే చింతమానుపల్లె గ్రామానికి చెందిన నాగేశ్వరరెడ్డికి, కర్ణాటకకు చెందిన సరితకు ఏడేళ్ల కిందట వివాహమైంది. వీరికి యశ్వంత్ (5), సందీప్‌రెడ్డి (18 నెలలు) అనే ఇద్దరు కుమారులున్నారు.
గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చెప్పుడు మాటలు విని నాగేశ్వర రెడ్డి తన భార్యపై అనుమానం పెంచుకుని చిన్న కుమారుడు తనకు పుట్టలేదని భావించి... తల్లి పక్కన నిద్రిస్తున్న సందీప్‌రెడ్డిని శుక్రవారం రాత్రి కిరాతకంగా చిన్నారి గొంతు కోశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్టు కోడుమూరు సీఐ పార్థసారథి, ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప చెప్పారు.