వారికి ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్... ఉచితంగా విమానంలో ప్రయాణించే అవకాశం...?
ఎయిర్ ఏషియా కంపెనీ తాజాగా ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాణికులకు ఉచితంగా విమానం ఎక్కే అవకాశం కల్పిస్తోంది. కేవలం కొంతమందికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కంపెనీ ఆరో వార్సికోత్సవం సందర్భంగా రెడ్ యాజ్ స్కీంను పొడిగిస్తున్నామని... ఈ స్కీమ్ లో భాగంగా .. డాక్టర్లకు ఉచితంగానే విమానాల్లో ఎక్కే ఛాన్స్ కల్పిస్తున్నామని.... దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
కంపెనీ దేశీయ విమాన ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. డాక్టర్లు జూన్ 19 లోపు వారి వివరాలను కంపెనీ వెబ్సైట్ ద్వారా వారి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది. వారికి రెడ్ పాస్ లు అందజేస్తామని... ఎవరైతే ఆ పాస్ కలిగి ఉంటారో వారు ఉచితంగా ప్రయాణించవచ్చని ఎయిర్ ఏషియా పేర్కొంది. 50 వేల మందికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.