తల్లి పాత్రలో కీర్తి సురేష్.. మొదటి సారి బయటపెట్టనుంది.?
ఇప్పుడు వరకు కీర్తి సురేష్ ఎన్నో పాత్రలో నటించింది. కానీ ప్రస్తుతం కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పెంగ్విన్ సినిమాలో మాత్రం కీర్తి సురేష్ ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని సరికొత్త పాత్రలో నటించబోతోన్నట్లు అర్థమవుతుంది. ఇటీవలే విడుదలైన పెంగ్విన్ టీజర్... సినిమాలో ఉండే ఎన్నో భావోద్వేగాలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది పెంగ్విన్ టీజర్.
ఇక కొడుకుకి తల్లి పాత్రలో ఈ సినిమాలో కీర్తి సురేష్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్ కు గురైన కొడుకు కోసం తల్లి పడే వేదన ఆరాటం సినిమాలో కనిపించనున్నాయి. ఇప్పటివరకు తన పాత్రలతో నవ్వించి నటించి మెప్పించిన కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమాలోని పాత్రతో మాత్రం ప్రేక్షకులను భయపెట్టినున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళ తెలుగు భాషల్లో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19వ తేదీన ఓటిటి వేదికగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది,