సుశాంత్ రాజ్ పుత్ మృతిపై సంతాపం తెలియజేస్తున్న సినీ ప్రముఖులు..?
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పలు విభిన్నమైన పాత్రల్లో నటించి యువ హీరోగా ఎంతో గుర్తింపు సంపాదించిన సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు సుశాంత్ రాజ్ పుత్. ధోని అనే సినిమా ద్వారా భారతీయ ప్రేక్షకులందరికీ సుపరిచితుడు గా మారి ఎంతో గుర్తింపు సంపాదించాడు సుశాంత్ రాజ్ పుత్.
అయితే యువ హీరో ఆత్మహత్య చేసుకోవడం వెనుక మానసిక ఒత్తిడే కారణమని తెలుస్తోంది. అయితే యువ హీరో ఒక్కసారిగా ఆత్మహత్య తీసుకొని చనిపోవడంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం షాక్ గురైంది. దీంతో చిన్న వయసులోనే ఎంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు అంటూ ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్ రాజ్ పుత్ మృతికి సంతాపం తెలువుతున్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.