బ్రేకింగ్ : ఏపీ ప్రజలకు అలర్ట్.... ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం...?

Reddy P Rajasekhar

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది.  గత 24 గంటల్లో ఇరు రాష్ట్రాల్లో అక్కడక్కడా తుంపర జల్లులు కురిశాయి. తెలుగు రాష్ట్రాల్లో నేడు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటన చేసింది. కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సముద్రంలో అలజడిగా ఉంటుందని.... మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచనలు చేశారు. 
 
రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉండటంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏపీలోని విశాఖ, విజయనగరం జిల్లాలకు విపత్తుల నిర్వహణ శాఖ పిడుగు హెచ్చరికలు జారీ చేసింది. ఈ రెండు జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: