బ్రేకింగ్ : సుశాంత్ మృతిపై కుటుంబ సభ్యుల అనుమానం.... సీబీఐ దర్యాప్తునకు డిమాండ్...?
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి మిస్టరీగా మారింది. కెరీర్ మంచి రైజ్ లో ఉన్న సమయంలో ఆయన ఆత్మహత్య ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. సుశాంత్ మరణంతో ఆయన స్వస్థలం పాట్నాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే తాజాగా ఆయన కుటుంబసభ్యులు సుశాంత్ హఠాన్మరణం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ సూసైడ్ చేసుకోలేదని.. హత్య జరిగుంటుందని ఆయన మేనమామ ఆరోపణలు చేశారు.
బీహార్ యువజన సంఘం, రాజ్ పుత్ మహాసభ సుశాంత్ ది హత్య అని... సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీని హత్యపై దర్యాప్తు చేయించాలని తాము కోరుతున్నామని వారు తెలిపారు. ఇటీవలే సుశాంత్ మేనేజర్ దిశా శాలిన్ సూసైడ్ చేసుకున్న కేసులో పోలీసులు సుశాంత్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆయన మేనమామ ఆర్.సి. సింగ్ చెప్పారు.