బ్రేకింగ్ : ఏపీఎస్‌ఆర్టీసీలో నకిలీ ఉద్యోగాల బాగో‌తం....?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా రీజియన్‌ ఆర్టీసీలో నకిలీ ఉద్యోగాల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేత ఒకరు ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని కోటి రూపాయలకు పైగా వసూలు చేశారని తెలుస్తోంది. వీడియో, ఆడియో టేపులు లీక్ కావడంతో నకిలీ ఉద్యోగాల బాగోతం వెలుగులోకి వచ్చింది. లక్షల్లో డబ్బులు చెల్లించినా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అసలు సూత్రధారి అయిన ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేత 34 మందికి ఫేక్ ఆర్డర్స్.... ఐడీ కార్డులను జారీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం అధికారులు మీడియా ముఖంగా నకిలీ ఉద్యోగాల బాగోతానికి సంబంధించిన విషయాల గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: