బ్రేకింగ్ : జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌లకు కరోనా పరీక్షలు... ?

Reddy P Rajasekhar

టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ప్రస్తుతం కడప సెంట్రల్ జైలు క్వారంటైన్ లో ఉన్నారు. వీరికి అధికారులు 2,707... 2,708 ఖైదీ నెంబర్లను కేటాయించారు. అనంతపురంలో కరోనా పరీక్షలు నిర్వహించగా ఫలితాలు రావాల్సి ఉంది. ముందస్తు జాగ్రత్తగానే వీరిద్దరికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కరోనా పరీక్షల నివేదికలు రాగానే సాధారణ బ్యారక్ లకు తరలించే అవకాశం ఉంది. 
 
శనివారం రోజున ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షలు నిర్వహించి 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని రెడ్డిపల్లి, తాడిపత్రి జైళ్లకు తరలించారని భావించారు. కానీ అక్కడ కరోనా భయంతో సూపరింటెండెంట్ అనుమతి ఇవ్వకపోవడంతో కడప జైలుకు ఇద్దర్ని తరలించారు. 154 బస్సులు నకిలీ NOC, ఫేక్ ఇన్స్యూరెన్స్ కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: