ఇలాంటి స్వీట్ మెమరీస్ నిన్ను గుర్తు చేస్తూనే ఉంటాయి సుశాంత్..?
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో ఎన్నో కష్టాలను అధిగమించి బుల్లి తెర నుండి వెండితెరకు ఎదిగి ఓ గుర్తింపును సంపాదించుకున్న హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. అలాంటి యువహీరో కెరియర్ విజయవంతంగా కొనసాగుతున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ షాక్కు గురి చేసిన విషయం తెలిసిందే. నిన్న మధ్యాహ్నం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దీంతో సుశాంత్ మృతిపై ఎంతో మంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో ప్రతిభ కల నటుడిని కోల్పోయింది అంటూ విషాదం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నీరజ్ కుమార్ అనే వ్యక్తి ఓ పోస్ట్ చేస్తూ ఇలాంటి స్వీట్ మెమోరీస్ ఎప్పటికీ నిన్ను మాకు గుర్తు చేస్తూనే ఉంటాయి... రెస్ట్ ఇన్ పీస్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ అంటూ ఒక ట్విట్ పెట్టారు.