జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ లా దేశాన్ని దోచుకోలేదు... నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు....?
టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఫిబ్రవరి 22 నుంచి టీడీపీ నేతలపై కేసులు పెడుతూ వచ్చారని చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ లా దేశాన్ని దోచుకోలేదని అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్థిక నేరస్థుడు కాదని వ్యాఖ్యలు చేశారు. మజ్జిగ, నెయ్యిపై సీబీఐ విచారణ చేయిస్తారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై తప్పుడు విధానాలు కొనసాగిస్తున్నారని అన్నారు.
వైసీపీ నేతలు 6 లక్షల కోట్ల అవినీతి అన్నారు నిరూపించారా....? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు తొందర్లోనే తిరగబడే రోజు వస్తుందని ప్రశ్నించారు. వైసీపీ నేతలు స్పీకర్ కులాన్ని తిడతారని... ఈసీ కులాన్ని తిడతారని అన్నారు. కోర్టులకు వెళ్లేందుకు అనుమతి లేదని మమ్మల్ని ఆపేశారని వ్యాఖ్యలు చేశారు.