తెలంగాణలో లాక్ డౌన్ పెట్టే ఉద్దేశం లేదు... స్పష్టం చేసిన సీఎస్ సోమేష్ కుమార్....?

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి లాక్ డౌన్ ను అమలు చేస్తామని వస్తున్న వార్తల గురించి స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అన్నారు. కరోనా విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో నమ్మకం పెంచేందుకే కరోనా పరీక్షల సంఖ్య పెంచామని అన్నారు. 
 
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 650 మంది కరోనాకు ఇంటి నుంచే చికిత్స చేయించుకుంటున్నారని చెప్పారు. ఎవరికైనా డబ్బులు కట్టి చికిత్స చేయించుకునే ఉద్దేశం ఉంటే ప్రైవేట్ ఆస్పత్రిలో చేరవచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అందరికీ ఉచితంగా చికిత్స చేయిస్తోందని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: