బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.... ఆటోలపైకి దూసుకెళ్లిన లారీ.. ఏడుగురు మృతి...?

Reddy P Rajasekhar

బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం గయ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. అమస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిష్ణుగంజ్ గ్రామం వద్ద రెండు ఆటోలపై ట్రక్కు దూసుకెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో ఎదురుగా వచ్చిన ట్రక్ ఆటోలపైకి దూసుకెళ్లటంతో ఘటనాస్థలంలోనే ఏడుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
క్షతగాత్రులకు మదన్‌పూర్ హాస్పిటల్‌‌లో ప్రాథమిక చికిత్స అనంతరం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు సీనియర్ ఎస్పీ రాజీవ్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులు అమస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెగానియా గ్రామానికి చెందినవారని తెలుస్తోంది. బలుగంజ్‌లోని తమ బంధువుల ఇంటిలో జరిగిన ఓ వేడుకకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: