బ్రేకింగ్ : రైతుబంధు మార్గదర్శకాలు విడుదల.... వీరు మాత్రమే పథకానికి అర్హులు...?

Reddy P Rajasekhar

తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో రైతుబంధు పథకం అమలు కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈరోజు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,000 రూపాయల చొప్పున ప్రభుత్వం రైతుబంధు సాయం అందించనుంది. జనవరి 23వ తేదీన సీ.సీ.ఎల్.ఏ ఇచ్చిన వివరాల్లోని పట్టాదారులకు మాత్రమే ప్రభుత్వ సాయం అందనుంది. ఆర్.వో.ఎఫ్.ఆర్ పట్టాదారులకు, పెద్దపల్లి జిల్లా కాసుపల్లిలో దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న వారికి సాయం అందనుంది. 
 
ప్రభుత్వం ఈ పథకం కొరకు ఏడాదిలో ఒకేసారి వివరాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ప్రతి సీజన్ ముందు అమ్మిన భూముల వివరాలను ఈ పథకం నుంచి తొలగించి కొత్త పట్టాదారు పుస్తకాలకు తదుపరి ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సాయం అందించనుంది. ఎవరైనా రైతు బంధు సాయం వద్దనుకుంటే గివ్ ఇట్ అప్ ఫారం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వారం పది రోజుల్లో రైతుల ఖాతాలలో నగదు జమ కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: