బ్రేకింగ్ : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు టీడీపీ షాక్...?

Reddy P Rajasekhar

2019 ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలిగిరిలు వైసీపీలో చేరకపోయినా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ ముగ్గురు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది. ఈ నెల 19వ తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి వర్ల రామయ్యకు ఓటు వేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. టీడీపీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు కాబట్టి ముగ్గురు ఎమ్మెల్యేలు అధికారికంగా ఆ పార్టీలో ఉన్నట్లే. 
 
అందువల్ల టీడీపీ ముగ్గురు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే చర్యలు తప్పవని టీడీపీ హెచ్చరించింది. ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి బహిరంగంగా మద్ధతు తెలుపుతూ ఉండటంతో టీడీపీ వారిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో విప్ ను జారీ చేసింది. ఎవరైనా ఆదేశాలను పాటించకపోతే వారిపై టీడీపీ కఠిన చర్యలు తీసుకోనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: