బ్రేకింగ్ : లక్నోలో దారుణం.... పెళ్లి రోజే హ‌త్య‌ చేసిన‌ వ‌రుడు...?

Reddy P Rajasekhar

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్వీట్ల విషయంలో మొదలైన గొడవ ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమైంది. పూర్తి వివరాలలోకి వెళితే రాష్ట్రంలోని అట్సైని ప‌హ‌ర్‌పూర్ గ్రామానికి చెందిన‌ 26 ఏళ్ల యువ‌కుడు మ‌నోజ్ కుమార్‌కు గోవింద్‌పూర్ అదుల్లాపూర్‌కు చెందిన యువ‌తికి రెండు రోజుల క్రితం వివాహం జరిగింది. పెళ్లి అనంతరం జరిగిన బరాత్ వేడుకలో మద్యం తాగిన వరుడు భోజ‌నాలు స‌రిగా లేవంటూ, స్వీట్లు రుచిగా లేవంటూ వధువు బంధువులతో గొడవ పెట్టుకున్నాడు. 
 
వరుడు పెళ్లికూతురి బంధువుపై కాల్పులు జరపగా ఆ వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. ఆ తరువాత వధువు తమ్ముడి(9)ని కొట్టి కారులో తీసుకెళ్లి చంపేశాడు. మూడు గంటల తరువాత వధువు తమ్ముడి శవాన్ని వివాహ వేడుక జరిగిన స్థలానికి పంపించాడు. వరుడు గొంతు పిసికి వధువు సోదరుడిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు బాలుడి శవాన్ని పోస్ట్‌మార్ట‌మ్‌కు త‌ర‌లించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: