ఆర్టీసీ బస్ డ్రైవర్ కు కరోనా పాజిటివ్... డిపో మూసివేత....?
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా కేరళలో ఆర్టీసీ డ్రైవర్‌కు కరోనా నిర్ధారణ అయింది. దీంతో కేరళ ఆర్టీసీలో కలకలం రేగింది. .. పప్పనమ్‌కొడె బస్ డిపోలో విధులు నిర్వహిస్తున్న 40 ఏళ్ల వయసున్న బస్సు డ్రైవర్ తీవ్ర జ్వరంతో బాధ పడుతూ ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఆయనకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ గా తేలింది.
బస్ డ్రైవర్ కు కరోనా నిర్ధారణ కావడంతో 50 మంది ఉద్యోగులను అధికారులు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. బస్ డ్రైవర్ కు కరోనా నిర్ధారణ కావడంతో పప్పనంకొడె బస్ డిపో తాత్కాలికంగా మూతబడింది. క్వారంటైన్ లో ఉన్న ఉద్యోగులకు ఐదు రోజుల తరువాత కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.