భారత సైన్యం వాళ్లకు ధీటైన సమాధానం ఇస్తుంది : విజయసాయిరెడ్డి

Reddy P Rajasekhar

సోమవారం రాత్రి భారత్ చైనా దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో భారత్ కు చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందగా చైనాకు చెందిన 45 మంది సైనికులు చనిపోయారని తెలుస్తోంది. తాజాగా ఈ ఘర్షణల గురించి స్పందిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు. 
 
విజయసాయిరెడ్డి తన ట్వీట్లో జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యలను ఎవరూ రాజకీయం చేయవద్దని కోరారు. మనమంతా భద్రతా దళాలు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి నిలబడదామని సూచనలు చేశారు. భారత సైన్యం చొరబాటుదారులకు ధీటైన సమాధానం ఇస్తుందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉందామని పిలుపునిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: