బ్రేకింగ్ : వికారాబాద్ జిల్లాలో ప్రేమ జంట బలవన్మరణం... గత నెలలోనే యువతికి వివాహం...?

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా నవాబుపేటలో ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవటం..... యువతి తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేయటంతో కలిసి చావాలని నిర్ణయించుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన సార్ల కార్తీక్‌(21) అదే గ్రామానికి చెందిన మీనా(21) ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 
 
కార్తీక్‌ ఇంటర్‌ వరకు చదివి కారు డ్రైవర్‌గా పని చేస్తుండగా... మీనా పదవ తరగతి వరకు చదివి ఇంటి దగ్గర ఉంటోంది. ఇళ్లు పక్కపక్కనే కావడంతో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. మీనా తరచూ కార్తీక్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉండటంతో ఆమె తల్లిదండ్రులు మందలించి మహేశ్వరం మండలం గట్టుపల్లికి చెందిన ఓ యువకునికి ఇచ్చి వివాహం జరిపించారు. మంగళవారం అత్తవారింటి నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చేసిన మీనా కార్తీక్ ను కలిసింది. అనంతరం ఇరువురూ ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయంచుకుని నైలాన్‌ తాడుతో వేప పెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: