బ్రేకింగ్‌:  భార‌త్‌లో క‌రోనా క‌కావిక‌లం.. 24 గంట‌ల్లో వీర విజృంభ‌ణే..

VUYYURU SUBHASH

ప్ర‌పంచంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం ఎంత మాత్రం త‌గ్గ‌లేదు. మ‌న దేశంలోనూ రోజు రోజుకు క‌రోనా కేసులు ఎలా పెరిగిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. గ‌త వారం రోజులుగా ఇక్క‌డ క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇక గ‌త 24 గంట‌ల్లో మ‌న దేశంలో ఏకంగా 12, 881 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి.

గ‌త 24 గంట‌ల్లో ఇక్క‌డ న‌మోదు అయిన 12,881 కరోనా కేసులు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక రోజులో న‌మోదు అయిన అత్య‌ధిక కేసులు అని చెప్పాలి. ఈ కేసుల‌తో మ‌న దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 3,66,946 కు చేరుకుంది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 1,60,384..కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,94,324..కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 12,237కు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: