బ్రేకింగ్ : భక్తులకు షాక్.... పూరి జగన్నాథ రథయాత్రపై సుప్రీం కీలక వ్యాఖ్యలు...?
ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిగే పూరీ జగన్నాథుడి రథయాత్ర విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రథయాత్రపై స్టే విధించిన సుప్రీం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. "ప్రస్తుత పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహణకు మేం అంగీకరిస్తే.. ఆ జగన్నాథుడు మమ్మల్ని క్షమించడు.." అని ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బోబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజారోగ్యం, పౌరుల భధ్రత కోరకు.. ఈ ఏడాది రథయాత్రను అనుమతించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. రథయాత్ర నిర్వహణ సబబు కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. జూన్ 23 న ప్రారంభం కానున్న రథయాత్రను వాయిదా వేయాలంటూ ఓ పిటీషనర్ సుప్రీంకోర్టు మెట్లెక్కగా సుప్రీం పిటిషన్ ను విచారణకు స్వీకరించి రథయాత్ర కార్యకలాపాలపై స్టే విధించింది.