బ్రేకింగ్ : తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.... త్వరలో ఆన్ లైన్ పాఠాలు...?

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా వైరస్ అనేక రంగాల్లో మార్పులకు కారణమవుతోంది. వైరస్ వ్యాప్తి వల్ల విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండగా తెలంగాణ విద్యాశాఖ కూడా ఆన్ లైన్ క్లాసులకు సిద్ధమవుతోంది. ఇందుకోసం విద్యాశాఖ ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతోంది. 
 
హైదరాబాద్ డీఈవో జూన్ నెల చివరివారం నుంచి యూట్యూబ్ ద్వారా ఆన్ లైన్ క్లాసులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మొదట పదో తరగతి విద్యార్థులకు క్లాసులు ప్రారంభమవుతాయని ఆ తర్వాత మిగిలిన క్లాసులకు ఆన్ లైన్ క్లాసెస్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. త్వరలో ఆన్ లైన్ తరగతుల కోసం వెబ్ సైట్ ను లాంచ్ చేయనున్నామని.... లైవ్, రికార్డెడ్ ద్వారా విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధించనున్నారని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: