బ్రేకింగ్ : భారత్ ప్రశ్నలకు తడబడ్డ చైనా విదేశాంగ అధికారి... మేకుల రాడ్‌లతో దాడి చేసిన డ్రాగన్ సైనికులు....?

Reddy P Rajasekhar

లఢఖ్ సరిహద్దులో చైనా భారత్ సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో ఇనుప మేకులు వెల్డింగ్‌ చేసిన రాడ్‌లతో భారతీయ సైనికులను కొట్టి చంపినట్లు కల్నల్ సంతోష్ పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. చైనా సైనికులు పకడ్బందీగా మేకులు వెల్డింగ్‌ చేసిన ఇనుప రాడ్లతో వచ్చి దాడి చేయడంతో భారత్ 20 మంది సైనికులను కోల్పోవాల్సి వచ్చింది. చైనా పక్కా ప్రణాళికతోనే భారత్ పై దాడి చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 
 
మరోవైపు భారత్ నుంచి ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక చైనా విదేశాంగ అధికార ప్రతినిధి ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. భారత్ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానాలు దాటవేశారని సమాచారం. గాల్వన్ నదిపై డ్యాం కడుతున్న విషయం తనకు తెలియదని ఆయన వ్యాఖ్యలు చేశారు. చైనా సైనికులు మేకులు అమర్చిన ఇనుప రాడ్‌లతో కల్నల్ సంతోష్ ను కొట్టి చంపారా....? చైనా వేసిన టెంట్‌ను తొలగించడానికి భారత్ ప్రయత్నించిన సమయంలోనే ఘర్షణ జరిగిందా....? అని భారత్ అడిగిన సమయంలో భారతీయ సైనికులదే తప్పు అనేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: