అమర వీరుడికి ఘన నివాళి.... జవాన్ భౌతిక ఖాయాన్ని మోసిన సీఎం....?

Reddy P Rajasekhar

సోమవారం రాత్రి చైనా సైనికులు చేసిన పాశవిక దాడిపై భారత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చైనా బలగాలతో పోరాడి అమరులైన సైనికులకు దేశ ప్రజలు ఘనమైన నివాళి అర్పిస్తోంది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాగేల్ మరో అడుగు ముందుకేసి సైనికుడి పార్థివ దేహాన్ని భుజాలపై మోశారు. సీఎం హోదాలో తమ ముద్దుబిడ్డకు ఆయన జోహార్లు అందించారు. వీర జవాన్ గణేశ్ రామ్ కుంజామ్ భౌతికకాయం ఉంచిన శవపేటికను సీఎం మోసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
సోమవారం రాత్రి చైనా భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో అమరులైన వారిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గణేశ్ రామ్ కుంజామ్ ఒకరు. నిన్న మధ్యాహ్నం ఆయన పార్థివ దేహం ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ కు చేరుకోగా సీఎం భూపేశ్ బాగేల్ అక్కడకు చేరుకుని పుష్పాంజలి ఘటించి.... ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా ఆయన మృతదేహాన్ని గిధాలికి తరలించారు. సీఎం భూపేశ్ బాగేల్ జవాన్ తండ్రికి 20 లక్షల రూపాయల చెక్కును అందజేసి గొప్ప మనస్సును చాటుకున్నారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: