బ్రేకింగ్ : కరోనా కొత్త లక్షణాలు... కళ్లు ఎర్రబారడం వైరస్ సంకేతమే...?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. సాధారణంగా కరోనా రోగులు జ్వరం, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడతారనే సంగతి తెలిసిందే. తాజాగా కళ్లు ఎర్రబారడం కూడా కరోనా సంకేతమే అని పరిశోధనల్లో తేలింది. కెనడాలోని ఆల్బెర్టా విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్లోస్ సోలర్టె కళ్లు ఎర్రబారినా కరోనా సోకి ఉండవచ్చని తెలిపారు. కంటి సమస్యతో ఒక మహిళ తన దగ్గరకు వచ్చిందని ఆమెకు కరోనా నిర్ధారణ అయిందని చెప్పారు. 
 
కరోనా రోగుల్లో కళ్లు ఎర్రబడటం, కండ్ల కలక లాంటి లక్షణాలు 10 నుంచి 15 శాతం మందిలో కనిపిస్తున్నాయని.... ఈ సమస్యలతో ఎవరైనా కంటి ఆస్పత్రులకు వస్తే కరోనా పరీక్షలకు సిఫారసు చేయడం మంచిదని ఆయన సూచనలు చేశారు. కరోనా వైరస్ కు సంబంధించి ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణాలు కనిపిస్తూ ఉండటంతో ప్రజల్లో భయాందోళన అంతకంతకూ పెరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: