మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం... మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయబోమని ప్రకటన....?
మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ అనుమానిత మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయబోమని కీలక ప్రకటన చేసింది. మృతదేహాలకు పరీక్షలు నిర్వహించడానికి ఎక్కువ సమయం పడుతూ ఉండటం... అందువల్ల అంత్యక్రియలకు ఆలస్యమవుతూ ఉండటంపై వందల సంఖ్యలో ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో మృతదేహాలను పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రదీప్ వ్యాస్ మాట్లాడుతూ మృతుల కాంటాక్ట్స్ ఆధారంగా కరోనా ఫలితాలను కనుక్కుంటామని అన్నారు. కంటైన్మెంట్ జోన్లలో మరణించిన వారికి మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మరోవైపు మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించటం వల్ల తప్పుడు ఫలితాలు వచ్చే ఆస్కారం ఉందని కేంద్రం అభిప్రాయపడింది.