వేగంగా విజృంభిస్తోన్న కరోనా... ఢిల్లీ సర్కార్ కీలక ఆదేశాలు....?
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా విజృంభణ వల్ల దేశ రాజధాని ఢిల్లీ నగరం గజగజా వణుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 53,116 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వం నుంచి వైద్యులకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే ఉద్యోగులు, వైద్యులకు సెలవులు రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ సర్కార్ ప్రకటించింది.
ప్రభుత్వం ఎవరైనా సెలవుల్లో ఉంటే వారు తక్షణమే విధులకు హాజరు కావాలని చెబుతోంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సెలవులు తీసుకోవచ్చని ఢిల్లీ సర్కార్ చెబుతోంది. ఢిల్లీలో వైద్యులు, నర్సుల కొరత ఉండటంతో ఢిల్లీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి వైద్య సిబ్బంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.