తెలంగాణలో వేగంగా విజృంభిస్తోన్న కరోనా.... ఒక్కరోజే 546 కేసులు....?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 546 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7076కు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
రాష్ట్రంలో ప్రస్తుతం 3,363 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 154 మంది గత 24 గంటల్లో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,506 మంది వైరస్ భారీన పడి కోలుకున్నారు. కరోనాతో గత 24 గంటల్లో ఐదుగురు మృతి చెందగా మృతుల సంఖ్య 203కు చేరింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కరోజే 458 కేసులు నమోదయ్యాయి.