నా సక్సెస్ కు కారణం వాళ్లిద్దరే.... దేవి శ్రీ ప్రసాద్ ఆసక్తికర పోస్ట్...?

Reddy P Rajasekhar

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రపంచ సంగీత దినోత్సవం, ఫాదర్స్ డే సందర్భంగా తన బలం మరియు సక్సెస్ కు రెండు మూల స్తంభాలు తన తండ్రి సత్యమూర్తి, గురువు మండోలియన్ శ్రీనివాస్ అని పేర్కొన్నారు. తాను వెలుగులోకి రావడానికి కారణమైన తండ్రి, గురువుకు ప్రణామం అని అన్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా దేవి శ్రీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు, సంగీత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 
 
దేవి శ్రీకి తన తండ్రి అంటే ఎంతో ప్రేమ. సినిమా ఆడియో ఫంక్షన్లలో కూడా తన తండ్రి జ్ఞాపకాలను దేవి శ్రీ అభిమానులతో పంచుకున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఒక సెలిబ్రిటీగా ఎదగడంలో సత్యమూర్తి ప్రోత్సాహం ఎంతో ఉంది. పలు తెలుగు హిట్ చిత్రాలకు స్క్రీన్ రైటర్ గా పనిచేసిన దేవి శ్రీ తండ్రి సత్యమూర్తి కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: