బ్రేకింగ్ : భారత్ పై మరో దాడికి సిద్ధమైన చైనా.... ఏం చేసిందంటే.....?

Reddy P Rajasekhar

గాల్వన్ లోయలో చొరబాట్ల ప్రణాళిక విఫలమైన తరువాత చైనా భారత్ పై సైబర్ దాడులను ప్రారంభించాలని కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ సంస్థలు, మీడియా సంస్థలు, ఫార్మా కంపెనీలు, టెలికాం ఆపరేటర్లను చైనా టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ భారత ప్రభుత్వాన్ని ఈ విషయంలో హెచ్చరించింది. సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ సైఫార్మా చైనా భాష మాండరిన్, కాంటోనిస్‌లలో డార్క్ వెబ్‌లో మాట్లాడుతున్నట్లు తాజాగా గుర్తించింది. 

 

ఈ హ్యాకింగ్ గ్రూపుల్లో చైనా సైన్యానికి నేరుగా సంబంధం ఉన్న గోతిక్ పాండా, స్టోన్ పాండా ఉన్నాయని సైఫార్మా చెబుతోంది. ncov2019.gov.in ఈ మెయిల్ నుంచి చైనా దాడికి పాల్పడే అవకాశం ఉందని... ఉచిత కరోనా పరీక్షల గురించి ఎటువంటి ఈ మెయిల్స్ వచ్చినా ఓపెన్ చేయవద్దని చైనా సూచిస్తోంది. రెండు మిలియన్ల మంది భారతీయులకు చెందిన ఈ మెయిల్ ఖాతాలను చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకొన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: