నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్.... కల్నల్ సంతోష్ కుటుంబానికి పరామర్శ....?
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు సూర్యాపేటకు వెళ్లనున్నారు. గాల్వన్ ఘటనలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈరోజు మధాహ్నం 3 గంటల సమయంలో సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం 5 కోట్ల రూపాయల చెక్ ను అందించనున్నారు. సంతోష్ భార్యకు గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు షేక్ పేటలో 500 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నారు.
ప్రభుత్వ సాయాన్ని సంతోష్ బాబు కుటుంబం సంతోషంగా ఒప్పుకుందని సమాచారం. తమతో పాటు దేశంలోని ఇతర సైనికులు కుటుంబాలకు కూడా సాయం చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించినట్లు తెలుస్తోంది. సూర్యాపేటకు సీఎం కేసీఆర్ రానుండటంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.