ఈఎస్ఐ స్కాంలో కోదాడకు ఏసీబీ... అజ్ఞాతంలోకి ప్రమోద్ రెడ్డి....?

Reddy P Rajasekhar

ఏపీ ఈఎస్ఐ స్కాంలో అవినీతి నిరోధక శాఖ విచారణ తెలంగాణ రాష్ట్రంలోని కోదాడకు చేరింది. అధికారులు టెలీహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్‌ ప్రమోద్ రెడ్డి కోసం ఇంటికి వెళ్లగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తేలింది. అధికారులు ప్రమోద్ రెడ్డికి ఈ స్కాంతో ఉన్న సంబంధం గురించి వివరాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఈఎస్ఐ డైరెక్టర్ రమేశ్ కుమార్ ఏ-1గా, మాజీమంత్రి అచ్చెన్నాయుడును ఏ-2గా చేర్చి అరెస్ట్ చేశారు. 
 
ఈ కేసులో ప్రమోద్ రెడ్డ్ ఏ - 3గా ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘించి టెలీహెల్త్ సర్వీసెస్ కు కాంట్రాక్టులు ఇచ్చారనే ఆరోపణలతో ప్రమోద్ రెడ్డిని ప్రశ్నించేందుకు అధికారులు కోదాడకు వెళ్లారు. ప్రమోద్ రెడ్డి స్విఛాఫ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అధికారులు ప్రమోద్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను ప్రశ్నించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమోద్ రెడ్డి కోసం అధికారులు నిఘా పెట్టినట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: