ఒకేరోజులో 55 మంది పోలీసులకు కరోనా..?

praveen

భారత దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా  వైరస్ తీవ్రంగా ఉంది. రోజురోజుకు భారీ రేంజ్లో కేసులు నమోదవుతున్నాయి. 


 ఇక అక్కడ ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు కూడా ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతుండటం  సంచలనంగా మారింది. గడచిన 24 గంటల్లో ఏకంగా 55 మంది పోలీసులు కరోనా  వైరస్ బారిన పడ్డారు. దీంతో మహారాష్ట్రలో కరోనా  వైరస్ తో బాధపడుతున్న పోలీసుల సంఖ్య 4103 కు చేరింది. కాగా  ఇప్పటివరకు మహారాష్ట్రలో 48 మంది పోలీసు అధికారులు చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: