ఆ హోటల్లో సుజనా, నిమ్మగడ్డ, కామినేని భేటీ.. అసలేం జరిగింది..?

Reddy P Rajasekhar

బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్చలు జరిపారంటూ ప్రముఖ టీవీ ఛానెళ్లలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో వీరి సమావేశం జరిగింది. ఈ నెల పదమూడో తేదీన పదకొండు గంటల తరువాత ఈ సమావేశం జరిగినట్లు... దాదాపు గంటన్నర సమయంపాటు చర్చలు జరినట్టు కథనాలు ప్రసారం కావడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. 
 
హైకోర్టు నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ పదవిలో నియమించాలని చెప్పినా ఆయన పదవిలో ఉన్నారో లేరో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఆయన కోర్టు ధిక్కార పిటిషన్ వేసే యోచనలో ఉన్నారని చర్చ జరుగుతోంది. తాజా లీక్ అయిన సీసీ ఫుటేజీ వల్ల నిమ్మగడ్డ వెనుక బీజేపీ నేతలు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ముగ్గురినీ ఒకే వ్యక్తి రిసీవ్ చేసుకోవడం... ముగ్గురూ ఒకే రూంలోకి వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారు....? బీజేపీ నేతలతో నిమ్మగడ్డ ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది...? బీజేపీతో సన్నిహిత సంబంధాల కోసమే నిమ్మగడ్డ వారిని కలిశాడా...? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: