కేంద్రం వైఫల్యం వల్లే దేశంలో కరోనా.... మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు..?
టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని అన్నారు. కేంద్రం వైఫల్యం వల్లే దేశంలో కరోనా వ్యాపిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం సడలింపులు ఇచ్చి నెపం రాష్ట్రాల మీదకు నెడుతోందని వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వలస కార్మికుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. మర్కజ్ కేసులను మేము అలర్ట్ చేసేవరకు కేంద్రం గుర్తించలేదని పేర్కొన్నారు.
ఐ.సీ.ఎం.ఆర్ నిబంధనల మేరకే పరీక్షలు జరిగాయని అన్నారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎక్కడ అమలైందో చెప్పాలని వ్యాఖ్యలు చెప్పారు. బీజేపీ పాలిత ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో కరోన లెక్కల గురించి మాట్లాడదామా....? అని ప్రశ్నించారు. ఆస్పత్రుల దగ్గర ధర్నాలు చేయడం బీజేపీ బాధ్యతారాహిత్యం అని అన్నారు.