బ్రేకింగ్ : డిగ్రీ, పీజీ, బీటెక్ పరీక్షలను రద్దు చేయాలి.... ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పవన్...?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, బీటెక్ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించకపోవడమే శ్రేయస్కరం అని అన్నారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించినట్లే డిగ్రీ, పీజీ, బీటెక్ తుది సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలని కోరారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లి పరీక్షలు రాయడం వారి ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని అన్నారు.
లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పటికే డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేశారని ఈ విషయాన్ని విశ్వవిద్యాలయాలు పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.
తుది సంవత్సరం పరీక్షలను రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించాలి.
- janasena Chief Sri @PawanKalyan pic.twitter.com/BM3aEiryz8 — janasena party (@JanaSenaParty) June 23, 2020