బ్రేకింగ్ : యూపీ ప్రతిపక్ష నాయకుడికి కరోనా పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సైతం కరోనా భారీన పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, సమాజ్ వాదీ పార్టీ లీడర్ రామ్ గోవింద్ చౌదరికి కరోనా నిర్ధారణ అయింది. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ప్రకటన చేశారు. నిన్నటి నుంచి ఆయన జలుబు, దగ్గుతో బాధ పడుతూ చికిత్స కోసం లక్నోలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.
వైద్యులు ఆయన రక్త నమూనాలను పరీక్షల కోసం పంపించగా కరోనా నిర్ధారణ అయింది. అధికారులు ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటివరకు 18,322 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 569 మంది వైరస్ భారీన పడి చనిపోయారు.