రాజీనామా చేసే ఆలోచనలో నిమ్మగడ్డ...?
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజీనామా చేసే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై ముందు నుంచి వైసీపీ నేతలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా బిజెపి నేతలు అది కూడా చంద్రబాబు నాయుడు కి అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు కలవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని పదవి నుంచి తప్పుకోవడం మంచిది అనే ఒత్తిడి వస్తుందని అంటున్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన గవర్నర్ ని కలిసి రాజీనామా లేఖను సమర్పించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక వీడియో తో ఆయన పరువు పోయింది అంటున్నారు.