బ్రేకింగ్ : విజయవాడలో పూర్తిస్థాయి లాక్ డౌన్... ఎప్పటినుంచంటే.....?
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26 నుంచి విజయవాడలో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలులో ఉండనుంది. అత్యవసర సేవలు, మెడికల్ షాపులు మినహా మిగిలిన వ్యాపార, వాణిజ్య సేవలు స్తంభించనున్నాయి.
రేపు, ఎల్లుండి ప్రజలు సరుకులు తెచ్చుకోవాలని కలెక్టర్ సూచించారు. మొదట వారం రోజుల పాటు లాక్ డౌన్ అమలు కానుందని... తర్వాత పరిస్థితులను సమీక్షించి లాక్ డౌన్ విషయంలో నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. విజయవాడలో పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు కూడా మూతబడనున్నాయి. అత్యవసర సేవలకు సంబంధించిన ఆఫీసులకు మాత్రం మినహాయింపులు ఇచ్చినట్టు కలెక్టర్ చెప్పారు.