గత 12 సంవత్సరాలుగా ముకేశ్ అంబానీ పొందుతున్న వార్షిక వేతనం ఎంతంటే....?
భారత కార్పొరేట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు ముఖేష్ అంబానీ. గత 11 సంవత్సరాలుగా తన వార్షిక వేతనాన్ని 15 కోట్ల రూపాయలకే పరిమితం చేసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ ఈ సంవత్సరం కూడా వార్షిక వేతనాన్ని 15 కోట్ల రూపాయలకే పరిమితం చేసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ హోదాలో 2008 - 2009 నుంచి జీతం, భత్యం, కమిషన్ రూపంలో ఆయన 15 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు.
ముఖేశ్ ప్రతి సంవత్సరం దాదాపు 24 కోట్ల రూపాయలను వదులుకుంటున్నారు. కంపెనీ ఇతర శాశ్వత డైరెక్టర్లు నిఖిల్, హితాల్, మేశ్వానీల వేతనాలు మాత్రం గత ఏడాది కాలంలో భారీగా పెరిగాయి. ముఖేశ్ 2019 - 2020 వేతనంలో 4.36 కోట్ల రూపాయల జీతం, భత్యాలు 9.53 కోట్ల రూపాయలు కమిషన్ గా ఉన్నాయి.