తెలంగాణలో కరోనా విలయతాండవం.... ఒక్కరోజే 891 కేసులు....?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఏపీకి రెట్టింపు స్థాయిలో తెలంగాణలో కేసులు నమోదవుతూ ఉండటం ప్రజలను మరింత టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 891 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 10,444కు చేరగా ఐదుగురు మృతి చెందారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 5,858 యాక్టివ్ కేసులు ఉండగా మరణాల సంఖ్య 225కు చేరింది. 4,361 మంది ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో 719 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.