మాస్క్ పెట్టుకోని కేసీఆర్‌... భ‌లే చ‌మ‌త్కారం చెప్పారు...!

Reddy P Rajasekhar

తెలంగాణ సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవులను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు ఇవ్వాలని... నాటిన ప్రతి మొక్కకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలని చెప్పారు. ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసిన ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని చెప్పారు. 
 
కరోనా వైరస్ విజృంభిస్తోందని... ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని.... తాను మాత్రం మాస్క్ పెట్టుకోలేదని కేసీఆర్ చమత్కరించారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తాయంటే ఎవరూ నమ్మలేదని.... దేశంలో 55 శాతం తెలంగాణలోనే పండిందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో ఉన్నవాళ్లు మళ్లీ గ్రామాలవైపు చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. తాను మొండివాడినని అని అనుకుంటే సాధిస్తానని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: