బ్రేకింగ్ : టిక్ టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్య..... మరణంపై అనేక అనుమానాలు.....?
టిక్ టాక్ యాప్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి సియా కక్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టిక్‌టాక్ సెన్సేషన్, డ్యాన్సర్ సియా కక్కర్(16) ఆమె సొంత ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. సియా వ్యక్తిగత మేనేజన్ అర్జున్ అధికారికంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్న సియా కక్కర్ ఆత్మహత్య గురించి అనేక సందేహాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం సియా చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్థం కావడం లేదని ఆమె మేనేజర్ తెలిపారు. సియాకు ఇన్‌స్టాలో 104కే, టిక్‌టాక్‌లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. నటనతో, డ్యాన్స్ లతో అభిమానులను ఎంతో అలరించిన సియా ఆత్మహత్యతో అభిమానులు షాక్ అయ్యారు. ఆమె ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.