తెలంగాణ హోం మంత్రి సిబ్బందికి కరోనా... హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నాడని విమర్శలు....?

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కార్యాలయంలో కరోనా ఆందోళన నెలకొంది. కొన్ని రోజుల క్రితం హోం గార్డు, భద్రతా సిబ్బందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా తాజాగా మరో ఐదుగురికి కరోనా నిర్ధారణ అయింది. 
 
హోం మంత్రి భద్రతా సిబ్బందిలో 50 మందికి పరీక్షలు నిర్వహించగా తొలివిడతలో 15 మందికి సంబంధించిన ఫలితాలు వచ్చాయి. మిగిలిన వారికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఆయన ఈరోజు మెదక్ జిల్లా నర్సాపుర్ లో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి రిస్క్ తీసుకోవడానికి బదులుగా హోం క్వారంటైన్ కు పరిమితమైతే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: