సరిహద్దు నుంచి వెనక్కు వెళుతున్న చైనా సైన్యాలు.... కానీ....?

Reddy P Rajasekhar

గత 50 రోజులుగా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. జూన్ 15వ తేదీ ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న అనంతరం వివాదాలను పరిష్కరించుకోవడానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు రేపు కూడా కొనసాగే అవకాశాలు ఐతే ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే చైనా సైనికులు కొందరు వెనక్కు వెళ్లినట్లు వార్తలు వస్తుండగా పూర్తి స్థాయిలో వెనక్కు వెళతామని చైనా చెబుతోంది. 
 
అయితే భారత్ మాతం చైనాను నమ్మటం లేదు. జూన్ 15కు ముందు కూడా వెనక్కు వెళతామని భారత్ ను నమ్మించి చైనా కుట్రపూరితంగా వ్యవహరించింది. మాల్డోలో జరుగుతున్న చర్చలు ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే దిశగానే సాగుతున్నాయని సైన్యం చెబుతోంది. తూర్పు లడఖ్ లోని అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కు వెళ్లేలా ఒప్పందం కుదిరిందని సమాచారం. 
 
ఇరు దేశాలు తప్పక నిబంధనలను పాటించాలని ఈ సమావేశంలో ప్రధానంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో వెళుతున్నామని చెప్పి కుట్రపూరితంగా వ్యవహరించిన చైనా విషయంలో భారత్ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే వెనక్కు వెళతామని చెప్పిన చైనా భారత్ ను రోడ్ల నిర్మాణాలు, బ్రిడ్జి నిర్మాణాలు ఆపేయాలని కోరుతోంది. భారత్ నిర్మాణాలు ఆపితే ఆ ప్రాంతాలు తమవేనని చైనా చెప్పుకుంటుంది. 
 
అయితే భారత్ మాత్రం గాల్వన్ లోయ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని చెబుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న ఆ నిర్మాణాల గురించి సమీక్ష జరపటంతో పాటు పనులను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భారత్ మాత్రం భూభాగం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా లేదని చెబుతోంది. ఈ వివాదం ఈ చర్చలతో ముగుస్తుందో లేదో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: