మా కొత్త కుటుంబ సభ్యులు.. శిఖర్ ధావన్ ఆసక్తికర పోస్ట్..?
టీం ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే శిఖర్ ధావన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.
తన ఇంట్లోకి వచ్చిన కొత్త కుటుంబ సభ్యులను అభిమానులకు పరిచయం చేశాడు శిఖర్ ధావన్ . రెండు కుక్కల తో దిగిన ఫోటోలు పంచుకుంటూ ఈరోజు ఈ క్యూటీలను దత్తత తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఇవీ మా కొత్త కుటుంబ సభ్యులు అనే క్యాప్షన్తో ఇచ్చాడు శిఖర్ ధావన్. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.