బతుకు తెరువు కోసం కూరగాయలు అమ్ముతున్న నటుడు.... ఆవేదన చెందుతున్న అభిమానులు...?
దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ చాలా మంది జీవితాలను చిద్రం చేస్తోంది. కరోనా విజృంభణ వల్ల చాలామంది రోడ్డున పడ్డారు. ఉపాధి లేక ఉద్యోగాలు కోల్పోయి ఆదాయం కోసం ఇతర మార్గాలను వెతుక్కుంటున్నారు. కరోనా, లాక్ డౌన్ సినీ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. వైరస్ వ్యాప్తి వల్ల రిలీజ్ కు సిద్ధమైన సినిమాల విడుదల ఆగిపోగా మరికొన్ని సినిమాల షూటింగులు మధ్యలోనే ఆగిపోయాయి.
లాక్ డౌన్ వల్ల గత మూడు నెలలుగా సినీ పరిశ్రమ పూర్తి స్థాయిలో స్తంభించిపోయింది. దీంతో సినీ కార్మికులు పొట్టకూటి కోసం అనేక మార్గాలను వెతుక్కుంటున్నారు. కొందరు నటులు అయితే మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండటం గమనార్హం. , తాజాగా బాలీవుడ్ నటుడు జావేద్ హైదర్ కూరగాయలు అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ ఫేమ్ డాలీ బింద్రా టిక్ టాక్ లో ఈ వీడియోను షేర్ చేశారు. అతనిని చూసి అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
He is an actor aaj woh sabzi bech raha hain javed hyder pic.twitter.com/4Hk0ICr7Md — dolly bindra (@DollyBindra) June 24, 2020