బ్రేకింగ్ : మచిలీపట్నంలో వైసీపీ నేత దారుణ హత్య.... పాతకక్షలే కారణమని అనుమానాలు...?

Reddy P Rajasekhar

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావును గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. భాస్కరరావు చేపల మార్కెట్ లో ఉన్న సమయంలో కత్తితో పొడిచి దుండగుడు పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన భాస్కరరావు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. 
 
భాస్కరరావు మరణవార్త తెలిసిన వెంటనే వైసీపీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు. మృతి చెందిన భాస్కరరావు గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్‌గా పని చేశారు. పోలీసులు భాస్కరరావు హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమలవుతోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: