ఆంధ్రజ్యోతి కిట్టప్ప చెత్తపలుకులో ఫ్రస్టేషన్ కనిపిస్తోంది : విజయసాయిరెడ్డి

Reddy P Rajasekhar

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను టార్గెట్ చేసి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి తన ట్వీట్లో ఆంధ్రజ్యోతి కిట్టప్ప కొత్త/చెత్త పలుకు లో ఫ్రస్టేషన్ కనిపిస్తోందని అన్నారు. జగన్ గారు 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీని కిట్టప్ప తప్పుబడుతున్నాడని.... మళ్లీ కులం యాంగిల్ తీస్తున్నాడని అన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖను అసలు నివాసానికి పనికిరాదంటూ ఆంధ్రా ఇమేజ్ దెబ్బతీసేలా రాతలు రాస్తున్నాడని ట్వీట్ చేశారు. 
 
మరో ట్వీట్లో పోలీస్ కేసుల్లో నిందితులైన అచ్చన్న, అయ్యన్న, జేసీకి నీ సపోర్ట్ జోక్యం ఏంటి కిట్టు అని ప్రశ్నించారు. వీలర్ డీలర్ సుజనా,నిమ్మగడ్డ భేటీపై రచ్చ అని జగన్ గారిపై రాస్తావేంటి కిట్టు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 151 సీట్ల ప్రజాతీర్పును ప్రశ్నించటానికి నువ్వెవరు కిట్టు అని పేర్కొన్నారు. ఏపీలో పచ్చకుల మీడియాలో టెర్రర్ వాతావరణం కనిపిస్తోందని..... అంత ఫ్రస్ట్రేషన్ అవసరమా కిట్టు అని ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: